నేటి గద్దర్ న్యూస్, వాజేడు.
పట్టుదలతో ఇష్టపడి చదివితే ఏదైనా సాధించగలము,ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని లెక్కచేయకుండా ముందుకు వెళ్లగలము. ఏ పరిస్థితులలోను అధరక బెదరక విజయ పతాకం ఎగురవెయ్యగలము. అసాధ్యమైనవి సుసాధ్యం చెయ్యగలము. ఇటువంటిదే ఈ చిన్నారి చిన్న విజయం…
అది కొండకోనల్లో ఉన్న చిన్న కుగ్రామం,కనీస సౌకర్యాలు లేని గూడెం, మండల కేంద్రానికి దూరంగా అభివృద్ధికి నోచుకోని గ్రామం పెనుగోలు.ఆ గ్రామం నుండి ఓ చిన్నారి నవోదయ సైనిక్ స్కూల్ లో సీటు సంపాదించుకుంది. సాధారణంగా ఈ పరీక్షలు చాలామంది పిల్లలు రాస్తుంటారు కాని కొందరికే సీటు వస్తుండటం మనకు తెలుసు,కానీ పెనుగోలుకు చెందిన ఉయిక రమేష్, రాంబాయిల కుమార్తె తరంగిణి మాత్రం తమ స్థితిగతులు మారాలంటే విద్యతోనే మార్పు సాధ్యమని భావించి పట్టుదలతో చదివి మొదటి సారి నవోదయ పరీక్ష రాయగానే సీటు సంపాధించుకుంది.
తరంగిణి ప్రస్తుతం వాజేడు మండల కేంద్రంలోని మిని గురుకుల బాలికల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది.ఈ క్రమంలోనే తరంగిణి సైనిక్ స్కూల్ లోను అటు నవోదయాలోనూ సీటు సాధించడంతో తనకు విద్య నేర్పిస్తున్న ఉపాధ్యాయురాలు తరంగిణిని,తన తల్లిదండ్రులను అభినందించారు.
ఈ సందర్భంగా రమేష్ రాంబాయి తమ కుమార్తె సైనిక్ స్కూల్లో,నవోదయలో సీటు సాధించడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.