◆మాదిగ, యాదవ, గౌడ సామాజిక వర్గాలకు ఎంపీ టిక్కెట్లు కేటాయించని కాంగ్రెస్ పార్టీ.
నాగర్ కర్నూల్ లోక్ సభ సీటు మల్లు రవి (మాల) సంపత్ కుమార్ (మాదిగ) పోటీలో చివరికి మల్లు రవికే సీటు దక్కింది. పెద్దపల్లి టికెట్ సైతం మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీ కృష్ణకు కేటాయించారు.
వరంగల్ ఎంపీ టికెట్ అయినా మాదిగ సామాజికవర్గానికి కేటాయిస్తారని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీహరిని తీసుకుని ఆయన కూతురు కడియం కావ్య (బైండ్ల)కి కేటాయించారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ మీద మాదిగ సామాజిక వర్గం గుర్రుగా ఉంది.
ఇదే కోవలో ఇప్పటివరకు ప్రకటించిన 14 ఎంపీ టికెట్లలో యాదవ, గౌడ సామాజికవర్గానికి ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు.
కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ మూడు స్థానాలు మాత్రమే పెండింగ్ ఉండగా అసలు గెలిచే అవకాశమే లేని హైదరాబాద్ స్థానంలో గౌడ లేదా యాదవ సామాజికవర్గానికి కేటాయించే అవకాశం.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ యాదవ సామాజికవర్గానికి ఇద్దరు క్యామ మల్లేష్, గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు ఇవ్వగా, గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మారావు గౌడ్, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్, గాలి అనిల్ కుమార్, కొప్పుల ఈశ్వర్ (మాల), ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (మాదిగ) ఇలా అన్ని సామాజికవర్గాలకు సమతుల్యత పాటిస్తూ గతంలో జరిగిన తప్పులు సరిద్దుకుంటు టిక్కెట్లు కేటాయించింది.
బీజేపీ మాత్రం యాదవ సామాజికవర్గానికి ఒక ఎంపీ టికెట్ కేటాయించలేదు.