న్యూస్:జూలూరుపాడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.తొలుత జగ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలను వేసే నివాళి అర్పించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా Msp & MRPS ప్రధాన కార్యదర్శి చెంగల గురునాధం మాట్లాడుతూ …
ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని
భారతదేశంలో వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకంగా పని చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం.. రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నది అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు దిబ్బందుల సాయికుమార్ మాజీ మండల అధ్యక్షులు కాకటి కృష్ణా
ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు చాపలమడుగు నరసింహారావు,చంగల నరసింహారావు రంజిత్. ప్రదీప్. కిరణ్. బుజ్జిబాబు . అశోక్ తదితరులు పాల్గొన్నారు.