+91 95819 05907

కాంగ్రెస్ 420 హామీలతో అధికారంలోకి వచ్చింది:Rega Kantharao

◆పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి
◆ ఎకరాకు రూ 25 వేలు నష్టపరిహారం చెల్లించాలి
◆ధాన్యానికి రూ. 500 బోనస్‌ హామీ నిలబెట్టుకోవాలి
◆ రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలి
◆ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో 209 మంది రైతుల ఆత్మహత్యలు
◆ ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికిరూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి
◆మణుగూరులో నిరసన కార్యక్రమం
◆తహశీల్దార్ కి పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేత
◆BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు Rega Kantha Rao

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

BRS జాతీయ కమిటీ పిలుపుమేరకు మణుగూరు మండల కేంద్రంలో శనివారం రైతుదీక్ష నిరసన కార్యక్రమం భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు ఆధ్వర్యంలో చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో మండుటెండలో బైఠాయించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేగా కాంతారావు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి రైతులను ఇబ్బందికి గురి చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో రైతుభరోసా పేరిట కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్కహామీని నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా, రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంట్‌కోతలు, ధాన్యానికి రూ. 500 బోనస్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవటమే కాకుండా కాంగ్రెస్‌ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ వివిధ మండలాల అధ్యక్షులు ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు యువజన నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !