★ సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తున్న ఎంపీటీసీ చింతపంటి సత్యం
నేటి గద్ధర్ న్యూస్ ,పినపాక నియోజకవర్గ ప్రతినిధి:
మండలపరిధిలోని తోగ్గూడెం గ్రామపంచాయతీ లో గల ఆరోగ్య ఉపకేంద్రంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ఫ్యాన్ లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఆసుపత్రికి వచ్చే రోగులు, వైద్యసిబ్బంది ఇబ్బంది పదుతున్న విషయం తెలుసుకున్న తోగూడెం MPTC చింతపంటి సత్యం 2 సీలింగ్ ఫ్యాన్ లను శనివారం ఆరోగ్య ఉపకేంద్రం సిబ్బందికి వితరణగా అందజేశారు. ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామాలలో నిరుపేదలు ,ప్రజలు ఏ కష్టాల్లో ఉన్న తన శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తూ వితరణ కార్యక్రమాలు చేపడుతున్న ఎంపీటీసీ చింతపండు సత్యం సేవలను పలువురు కొనియాడారు .ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఎంపీటీసీ చింతపంటి సత్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పి డాక్టర్ పవన్ వర్మ , ఏఎన్ఎం జి.అరుణ, ఆశాలు ఎం.చంద్రకళ, బి.సరోజినీ, ఎ. వరలక్ష్మి, బి. భువనేశ్వరి మరియు తదితరులు పాల్గొన్నారు.