నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురి చావు ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి. సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది.కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరి మురళి తన బిడ్డ చనిపోయింది అంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు.ఎంతో అల్లారు ముద్దు గా పెంచుకున్న తమ కూతురు కు కొంతమంది దొంగలు మాయమాటలు చెప్పి ట్రాప్ లో పడేశారని, అమ్మలారా అక్కలారా అయ్యలారా నా బిడ్డ పోయింది… కొంతమంది దొంగలు మోసం చేశారు… కష్టపడి Bitech చదివించా… మమ్మల్ని మోసం చేసింది అని ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడి గ్రామస్తులను కంటతడి పెట్టింది.
Post Views: 311