+91 95819 05907

క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలి

– రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– శీనన్న చేతుల మీదుగా ధూప దీప నివేదన అర్చక సంఘ పంచాంగం ఆవిష్కరణ
– అర్చకుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఖమ్మం: తెలుగువారి కొత్త ఏడాది అయిన శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలని, రాష్ట్రంతో పాటు దేశం మంచి దిశగా పయనించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్ లో జిల్లా ధూప, దీప నివేదన అర్చక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి ఏడాది రౌద్రావతారంలో ఉంటుందని పండితులు చెబుతున్నారని.. చల్లగా సాగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
*సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..*
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి.. హైదరాబాదులో అర్చకులతో సమావేశం నిర్వహించి ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా ఉండే అర్చకులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని అభయం ఇచ్చారు. అందరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అర్చకులు మంత్రి పొంగులేటిని సత్కరించారు.
*ఈ కార్యక్రమంలో..:* వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేత బొర్రా రాజశేఖర్, ధూప, దీప నివేదన అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ, కార్యదర్శి అన్నావజ్జుల ప్రసాద శర్మ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నం బొట్ల ఫణి కుమార శర్మ, కురుమేటి రామకృష్ణ శాస్త్రి, ఇంగువ సంగమేశ్వర శర్మ, నందుల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !