– క్షతగాత్రుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన మాజీ ఎమ్మెల్యే
గద్దర్ న్యూస్, ఏప్రిల్ 21, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(గుండాల) :
✍️అల్వాల వంశీ
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదివారం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం గుండాల మండలంలోని ఒక శుభకార్యానికి వెళ్లి వస్తున్న పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు నాగారం స్టేజి సమీపంలో యువకుడికి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలవడం గమనించారు. స్పందించిన రేగా వెంటనే అంబులెన్స్ ను పిలిపించి ప్రమాదంలో గాయపడ్డ యువకుడిన అంబులెన్స్ లో ఎక్కించి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు గడ్డంపల్లికి చెందిన వ్యక్తి అని సమాచారం. ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడులా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆపన్న హస్తం అందిస్తారని, ప్రజలకు సేవ చేయడంలో ఆయనకు సాటి మరెవరు రారని పలువురు కొనియాడారు