నేటి గద్ధర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి:
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 54 శాతం మంది ఉత్తీర్ణులు అయినట్లుగా ప్రిన్సిపల్ శేషుబాబు తెలియజేశారు. ప్రథమ సంవత్సరం ఫలితాలలో 59 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో జానీ 957 మార్కులు, బైపీసీలో జయలక్ష్మి 855 మార్కులు ,సీఈసీలో నరేంద్ర 574 మార్కులు, హెచ్ఇసిలో రాకేష్ 625 మార్కులు సాధించినట్లుగా తెలియజేశారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ లో జస్వంత్ 453 మార్కులు, బైపీసీలో ఐశ్వర్య 386 మార్కులు, సీఈసీ లో సంగీత 318 మార్కులు, హెచ్ఈసిలో సందీప్ 310 మార్కులు సాధించారని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ అధ్యాపక బృందం అభినందించారు.
Post Views: 292