– 22 మంది గిరిజన గురుకుల విద్యార్థులు ఎంపిక
నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 25, భద్రాద్రి కొత్తగూడెం :
జేఈఈ ఫలితాల్లో గిరిజన గురుకులాల ఆణిముత్యాలు తమ సత్తా చాటుతూ విజయభేరి మోగించారు. ఇంటర్ మొత్తం 33 మంది బాలికలు పరీక్షకు హాజరైతే అనూహ్యంగా 22 మంది జేఈఈ అడ్వాన్స్ కు సెలెక్ట్ కావడం విశేషం. బుధవారం అర్ధరాత్రి విడుదల అయిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో భద్రాచలం గిరిజన బాలికలు సంచలన ఫలితాలు నమోదు చేయటం భద్రాచలం ఏజెన్సీకే గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చింది. భద్రాచలం గిరిజన గురుకులంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన డి.ఐశ్వర్య 79.06, కే శ్రావణి 74.57, డి.నాగేశ్వరి 71.18, ఈ.స్వాంజిత 68.22, టి.సింధు 67.83, కె.వైష్ణవి 66.81,బి .స్నేహ 66.36, బి.అనిత 61.61, ఈ.రీతూ ప్రణయ 61.02, బి.హర్షిత 57.69, కె.చందన 55.27, అంజిత 55.16, బి.రేవతి 54.31, కె.పావని 53.03, బి.జాన్సీ 52.99, జి.సుమ లక్ష్మి 52.37, ఎం.సింధు శ్రీ 58.52, ఎస్.పుష్ప 52.18, బి.హరిణి 48.43, ఎస్.నవ్య శ్రీ 48.10, టి.నికిత 47.77, ఎస్.రూప శ్రీ 46.69 పర్సంటేజ్ సాధించారని భద్రాచలం గిరిజన గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు మాట్లాడుతూ… హైదరాబాద్ గురుకులం అధికారులు ప్రత్యేక శ్రద్ధ, మైక్రో షెడ్యూల్, వీకెండ్ పరీక్షలు, ప్రణాళిక బద్ధంగా ఆన్లైన్లో పరీక్షలకు సంబంధించి తగు సూచనలు సలహాలు, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ పర్యవేక్షణ, గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వర రాజు సలహాలు, వీరికి తర్ఫీది ఇచ్చిన అధ్యాపకుల యొక్క కృషి, నాన్ టీచింగ్ స్టాప్ సహకారం బాలికలు జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ చాటే అందుకు దోహద పడిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.