*రైతులకు ఇబ్బందులు లెకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు*
నేటి గద్దర్ న్యూస్,కరకగూడెం:మండల పరిధిలోని భట్టుపల్లి,కరకగూడెం, అనంతారం,గ్రామలాలోని పురుగు మందుల ఎరువుల షాపులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇటివల కురిసిన వార్షం,గాలులకు దెబ్బతిన్న పంట పోలాలను పరిశీలించారు.అలాగే మోతే గ్రామంలోని ధాన్యం కొనుగోలు కెంద్రన్ని పరిశీలించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చెయ్యాలని కొనుగోలు కేంద్రం ఇంచార్జీకి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం టెక్నికల్ అధికారి సాయి నారాయణ, కరకగూడెం మండల వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ,పినపాక మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మణుగూరు మండల వ్యవసాయ శాఖ అధికారి రామ శివరావు,ఏఈఓలు అనిల్,ప్రశాంత్,రైతులు పాల్గొన్నారు.
