నేటి గద్దర్ న్యూస్, జూలూరుపాడు : మండల కేంద్రంలో జరుగుతున్న NREGS పనులను అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు ఎస్.కె ఉమర్ పరిశీలించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి కూలీలకు రోజువారీ కనీస వేతనమైన కూలి 300 రూపాయలు చేయాలని,కనీస సౌకర్యాలు త్రాగునీరు, టెంటు,ప్రధమ చికిత్స పెట్టే పార గడ్డపారలు కల్పించాలి అని డిమాండ్ చేశారు. డిసెంబర్ నెల నుండి ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి కూలీలకు ఇంతవరకు వేతనాలు రాలేదని పనులకు సంబంధించిన వేతనాలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వల్లోబి రమేష్, బత్తులగోపి,నరసింహారావు, రామారావు కూరాకుల నరసింహారావు, బాలు, చంద్రు, శీను , గోపయ్య జానిమియా,కృష్ణ, రాధా, లక్ష్మి రమణ,రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
