నేటి గదర్ న్యూస్, ఏప్రిల్ 27, ములుగు :
వెంకటాపురం మండల పరిధిలోని బెస్త గూడెం గ్రామంలో శనివారం బెస్తగూడెం యూత్ అభినయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బెస్తగూడెం యూత్ అభినయ్ చేయూత ఫౌండేషన్ వారు ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రి వారితో మాట్లాడి బ్లడ్ బ్యాంకులో కూడా రక్త కొరత ఉన్నందున సిబ్బంది కూడా కూడా వెంటనే స్పందించి బెస్తగూడెంలోని వాడగూడెం లో రక్తదాన శిబిరం పెట్టి ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా ఏటూర్ నాగారం ప్రభుత్వాసుపత్రికి 11 యూనిట్ల రక్తం ఇప్పించడం జరిగింది. బెస్తగూడెం యూత్ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసినందుకు చేయూత ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాష్, జనగం మన ప్రభాకర్, వాడుగూడెం యూత్ అభినయ్, పవన్, సంతోష్, అనిల్, వెంకటేష్, ప్రశాంత్, నవీన్ ,రాజేష్, ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ మళ్లీకాంబ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.