★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు Rega Kantha Rao
నేటి గద్ధర్ న్యూస్,ఏప్రిల్ 28, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఈనెల 30న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన BRS అధినేత KCR రోడ్డు షో విజయవంతం చెయ్యాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. రేగా ఆదివారం ఆళ్లపల్లి మండలం లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన
మర్కోడు గ్రామం లో BRSమండల నాయకుల తో కలిసి మాట్లాడుతూ… భద్రాద్రి జిల్లా కేంద్రం లో ఈ నెల 30 తారీకు కెసిఆర్ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం సమీపంగా ఉన్న నియోజకవర్గాల గ్రామాల నుండి రైతులు ,పోడుసాగుదారులు, బి ఆర్ ఎస్ శ్రేణులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కెసిఆర్ టూర్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. మండల అధ్యక్షులు పాయం నరసింహారావు గారు. మండల నాయకులు పాల్గొన్నారు.
