+91 95819 05907

KCR నోరు తెరిస్తే చెప్పేది అబద్దమే. :భట్టి

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ పార్టీ నిర్మించబడింది.
కేసీఆర్ చెప్పే అబద్దాలు అసహ్యంచుకునే తెలంగాణ ప్రజలు వాళ్లను బండకేసి కొట్టి మరీ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు.
అబద్దాలతో, కట్టు కథలతో ఈ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వానిిక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ దేశ సంపదను, వనరులను ప్రజలకు చెందకుండా తన సన్నిహితులపై క్రోని కేపిటలిస్టులకు మోదీ కట్టబెడుతున్నారు.
దేశ సంపదను ప్రధాని మోదీ, రాష్ట్ర సందను కేసీఆర్ ఈ పదేళ్లలో దోచేశారు. మరోసారి బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపి సంపదను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక వైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే బీజేపీ-మోదీ ఒకవైపు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, దేశ సందను ప్రజలకు పంచాలనే రాహుల్ గాంధీ మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు దగ్గరకు వచ్చారు.
మనమంతా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ఖమ్మం అభ్యర్తి రామసహాయం రఘురామిరెడ్డికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.
మండుటెండలను సైతం లెక్కచేయకుండా మా కోసం వచ్చిన మీకు హ్రుదయపూర్వక నమస్కారాలు.
నిన్న ఇక్కడకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. నోటికి వచ్చిన అబద్దాలన్నీ చెప్పి వెళ్లారు.
అబద్దాల పునాదులపై బతుకుతున్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాదుడూ.. కాంగ్రెస్ అధిారంలోకి వస్తే హామీలు అమలు చేయలేరని అబద్దాలు మాట్లాడుతున్నారు.
మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీని రూ. 10 లక్షలకు పెంచడం చేశాము.
మార్చి ఒకటో తేదీనుంచి 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగించే పేద కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం జరిగింది.
నిరుపేద, అర్హత కలిగిన అబ్దిదారులకు రూ. 500కే గ్యాస్ ఇస్తున్నాం.
అంతేకాక ప్రతి నియోజకవర్గంలో నిరుపేదల కోసం 3,500 రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం.. వారికి తప్పకుండా అందిస్తాం.
స్థానిక మంత్రి. . మా పాలేరు నియోజకవర్గంలో పేదలు, దళిత, గిరిజనులు అధికంగా ఉంటారు.. మాకు అధికంగా ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. తప్ప కుండా అధికంగానే ఇండ్లను మంజూరు చేస్తాం.

కేసీఆర్ తప పదేళ్లలో ఏనాడైనా పంట నష్టాన్ని అంచనా వేసి.. పరిహారాన్ని అందించారా?

ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేట్ చేయాలని ఆదేశించాం. జరిగిన నష్టంకు సంబంధించిన లెక్కలను కూడా తెప్పించుకున్నాం. తప్పకుండా పరిహారాన్ని అందిస్తాం. బడ్జెట్ లో కూడా కేటాయింపులు చేశాం.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాము. కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తాం.. ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
రాష్ట్రంలోని వర్సిటీల్లో విద్యుత్, తాగు నీరు పుష్కలంగా అందుబాటులో ఉంది. విద్యార్థులంతా అక్కడే ఉండి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు.
విద్యుత్ కోతలపై పదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారు. పవర్ కట్ అంటూ.. జగదీశ్వర్ రెడ్డి, శ్రినవాస్ష్ గౌడ్ ఇండ్లలో కూర్చుని తప్పుడు ట్వీట్లు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !