+91 95819 05907

విద్యార్థులు ఆ యూనివర్సిటీ ఖాళీ చేయాల్సిన అవసరం లేదు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత అవాస్తవం
యూనివర్సిటీ విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా చదువుకోండీ
తప్పుడు ప్రకటన ఇచ్చిన అధికారికి షోకాజ్ నోటీసు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో తాను విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. వెను వెంటనే విచారణ చేసిన అధికారులు విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాగునీరు, విద్యుత్తు కొరత మూలంగా మే ఒకటి నుంచి, 31 మే వరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లు, మెస్ లు మూసి వేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ ఒక ప్రకటన చేశారని, దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైనట్టు గమనించి తమ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని 33/11 కెవి సబ్ స్టేషన్ నుంచి రెండు ప్రత్యేక 11kv ఫీడర్ల ద్వారా నిరంతరం యూనివర్సిటీ మొత్తానికి విద్యుత్ సరఫరా జరిగిందన్న విషయం మీటర్ రీడింగ్ ల ద్వారా స్పష్టమైనట్టు అధికారులు వారి నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు. వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్ కు యూనివర్సిటీ రిజిస్టార్ ద్వారా షోకాస్ నోటీసు జారీ చేసినట్టు తెలిపారు.
యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. విద్యుత్తు, తాగునీటి సదుపాయాలను వెనువెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించామన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, నిశ్చింతగా యూనివర్సిటీలో ఉండి స్వేచ్ఛగా చదువుకోవచ్చు అన్నారు. ఖాళీ చేయాల్సిన అవసరం విద్యార్థులకు ఏమాత్రం లేదన్నారు.
గత ప్రభుత్వం అలవాటు మాదిరిగానే ఈ ఏడాది అధికారులు ప్రకటన చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత ఏడాది జారీ చేసిన ప్రకటన తమ వద్ద ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !