★మరోసారి సత్తా చాటిన విద్యార్థులు
★ ఉత్తమ ఫలితాలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన స్కూల్ యజమాన్యం
నేటి గద్ధర్ న్యూస్,హైదరాబాద్(రంగారెడ్డి):
2024 పదవ తరగతి ఫలితాల్లో హైదరాబాద్ కటేదాన్ మధుబన్ కాలనీ శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యార్థిని ,విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారు. విద్యాసంస్థ స్థాపించిన నాటి నుండి పారిశ్రామిక ప్రాంతంలో విద్యార్థులకు అందుబాటులో ఫీజులతో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఆవిద్యాలయం పనిచేస్తుంది. శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యార్థి Komma Sai Charan 9.7 అత్యుత్తమ Grade points సాధించి నట్లు ఆ విద్యాలయం యాజమాన్యం తెలిపింది. 37 మంది విద్యార్థులు SSC పరీక్షలకు అటెండ్ అయినట్లు తెలిపారు.వారిలో Komma Sai Charan 9.7 GPA సాధించారు. రానున్న రోజుల్లో రామకృష్ణ విద్యాలయం మరెన్నో ఉన్నత శిఖరాలను అవరోదించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతటి విజయానికి కారుకులైన అద్యాపిక, అధ్యాపకులతో పాటు తల్లితండ్రుల సహకారం మరువలేనిదని స్కూల్ మేనేజ్మెంట్ అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న అకాడమిక్ ఇయర్ లో మెరుగైన విద్యా బోధన అందిస్తామని ఆ పాఠశాల యజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.