+91 95819 05907

ఆ పార్టీ ని ఓటర్లు ఆదరించేనా?BRS బాస్ KCR కార్నర్ మీటింగ్స్ కి ఇసుక వేస్తే రాలనంత జనాలు

✍️కొత్త దామోదర్ గౌడ్,9581905907

★ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల లోపాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న కెసిఆర్
★KCR సభలు, కార్నర్ మీటింగ్స్ కి ప్రజల నుండి భారీ స్పందన
★ కార్నర్ మీటింగ్ లు అన్ని బహిరంగ సభలను తలపిస్తున్న వైనం
★ఆ స్పందన ఓటు బ్యాంకుగా మారుతుందా?
★గతం పునరావృతం అవుతుందా?
★ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు అంకెల స్థానాలు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్న కేసీఆర్

నేటి గద్ధర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ TRS. సబ్బండ వర్గాలను ఐక్యం చేసి మలిదశ ఉద్యమాలతో నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరే వరకు పోరాటం చేసి.. ఢిల్లీ పాలకుల తలవంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు వెనకడుగు వేయలేదు. ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమై ఢిల్లీ పాలకుల తలవంచాడు. ఏ స్వప్నం కోసం అయితే పోరు బాట పట్టాడో అది నెరవేరే వరకు కెసిఆర్ పంతం వీడలేదు. చివరికి తెలంగాణ సిద్ధించింది. తదనంతరం కాంగ్రెస్ పార్టీలో అప్పటి టిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని మాట ఇచ్చి… అప్పటి యూపీఏ ప్రభుత్వం కేసీఆర్ డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లి విజయం సాధించారు. తరువాత ఎన్నికల్లో సైతం భారీ మెజార్టీ సాధించారు. మూడవసారి మాత్రం కెసిఆర్ కి చుక్క అయింది. సోషల్ మీడియా అసత్య ప్రచారాలు, బలహీన వర్గాల ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో తీసుకువచ్చిన బంధు పథకాలు, సిట్టింగ్లపై వ్యతిరేకత తదితర కారణాలతో 2023 ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఓటమి ఫాలో అయింది. ఇది ఇలా ఉండగాకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా పాలన అందిస్తాం… గ్యారెంటీలు అమలు చేస్తాం…. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం… తదితర పెద్దపెద్ద హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ హామీలకు తెలంగాణ బడ్జెట్ సరిపోయేలా లేదని పలువురు మేధావులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు గొంతేత్తుతున్నారు. బీఆర్ఎస్ ఓటమి… అతి స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుండి వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ విషయాన్ని పసికట్టిన బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ బస్సు యాత్రతో ప్రజల బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం April 24 న హైదరాబాద్‌లోని BRS పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి 17 రోజుల ‘బస్సు యాత్ర’కు శ్రీకారం చుట్టారు . ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ యాత్రలో భాగంగా, ఆయన రాష్ట్రంలోని 40 పట్టణాల్లో రోడ్‌షోలు , సమావేశాలలో ప్రసంగిస్తారు. ఈ యాత్ర మే 10 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో నిర్వహించిన కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు కార్నర్ మీటింగులకు ప్రజల నుండి విపరీతమైన స్పందన లభిస్తుంది. బీఆర్ఎస్ క్యాడర్లో సైతం ఉత్సాహం నెలకొంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల జరిగిన సంఘటనలు బి ఆర్ ఎస్ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఎక్కడ బహిరంగ సభ నిర్వహించిన ఆయా జిల్లాలలో, నియోజకవర్గాలలో BRS అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడికే అనే విధంగా ప్రజలను విశేష స్పందన లభించింది. కానీ ఫలితాలు మాత్రం టిఆర్ఎస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా రావడం జరిగింది. దీనితో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో congress ,BJP తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైనట్లేనని విస్తృత ప్రచారం చేశారు …చేస్తున్నారు. ఎన్నో ఓటమీలు చెవి చేసిన కేసీఆర్ ఈ విష ప్రచారానికి భయపడలేదు. తన కూతురు తీహార్ జైల్లో ఉన్నప్పటికిని… గుండెలో సముద్రమంత బాధను దాచుకుని దాన్ని దిగమింగుతూ… నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగనివ్వను అని నినాదంతో బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర సైతం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల నుండి విపరీతమైన స్పందన లభిస్తుంది. బహిరంగ సభలను తలపించేలా ఇసుక వేస్తే రాలనంత జనాలు కెసిఆర్ కార్నర్ మీటింగ్ లకు , బహిరంగ సభలకు హాజరవుతున్నారు. డైరెక్ట్ గా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం మూలంగా ప్రజలు పడుతున్న కష్టాలు, తమ ప్రభుత్వం హాయంలో తెలంగాణ అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టింరో క్షుణ్ణంగా వివరిస్తున్నారు. కెసిఆర్ బస్సు యాత్ర అధికార పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. కానీ భారీ బహిరంగ సభలకు, కార్నర్ మీటింగ్లకు వచ్చే ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.KCR మాత్రం 12 కు పైగా పార్లమెంటు స్థానాలు గెలిచి కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వాన్ని శాసిస్తామని గంటాపథంగా చెప్తున్నాను. ఏది ఏమైనా జూన్ ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !