+91 95819 05907

నేటి యువత చదవాల్సిందే 🔥🔥🔥సోషల్ మీడియా జైలు పాలు చేస్తుంది.

✍️కొత్త దామోదర్ గౌడ్,9581905907
★ ప్రభుత్వాలనే శాసిస్తున్న సోషల్ మీడియా
★ అధికార ప్రతిపక్ష పార్టీలనే తేడా లేదు
★ తెలంగాణ ముఖ్యమంత్రి కి సైతం ఢిల్లీ పోలీసులు నోటీసుల జారి
★ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా నాయకుల అరెస్ట్
★బి ఆర్ ఎస్ నేత మన్నే క్రిశాంక్ సైతం అరెస్ట్
★ భౌతిక దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులు
★భావ స్వేచ్ఛకు భంగం కలిగించవద్దు అంటూనే ఒకరిపై ఒకరు కేసులు
★ ఐ టీ చట్టం 66(ఎ)ఎం చెబుతోంది
★ అసభ్యంగా ఉన్న కంటెంట్ ను తొలగించాలని మన యూట్యూబ్ పత్రికలు టీవీ ఛానళ్లకు నోటీసులు పంపించిన మాజీ మంత్రి KTR
★నేటి గద్ధర్ ప్రత్యేక కథనం
నేటి గద్ధర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: అతి ఎక్కువైతే ఎంత ప్రమాదకరమో నేటి సోషల్ మీడియాని చూస్తే అర్థమవుతుంది. ఒక పార్టీపై ప్రేమతోనో.. సమాజంలో జరుగుతున్న అవినీతి… ప్రజా పాలనలో లొసుగులు… సమస్యలు… కామెడీ.. వినోదం.. నాలెడ్జ్ ఇలా అన్నిటికీ సోషల్ మీడియా కేంద్ర బిందువుగా మారింది. ఓవర్ నైట్ లో సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పాపులర్ అయ్యారు. అంత క్రేజీ ఉన్న సోషల్ మీడియా రాజకీయం వచ్చేవరకు అబాసు పాలు అవుతుంది. ఎంతలా అంటే కేసులు పెట్టుకోవడం… వ్యక్తిగత దూషణలకు పాల్పడడం.. భౌతిక దాడులకు పాల్పడడం … వాట్సాప్ స్టేటస్ లలో మాటల యుద్ధాలు… ఇలా విపరీత పోకడలకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు వేదికగా మారాయి. దీనిపై నేటి గద్దర్ న్యూస్ డైలీ ప్రత్యేక కథనం. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు ప్రారంభమైన తొలినాళ్లలో ఎంతో ఉత్సాహంగా వాటిని చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా వినియోగించేవారు. నేడు అవి గొడవలకు దారి తీయడం, కేసుల పాలవ్వడం… జైల్లో పెట్టించడం ఈ స్థాయికి వెళ్ళింది సోషల్ మీడియా. రిజర్వేషన్లు తొలగిస్తారని అంశంపై సోషల్ మీడియాలో పంచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా నాయకులకు ఢిల్లీ పోలీసుల నుండి నోటీసులు రావడం జరిగింది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవంత్ కు నోటీసులు జారీ చేయడంపై కలకలం రేగింది. ఫేక్ వీడియోకు సంబంధించి రేవంత్ కు నోటిసులు వచ్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో కేసులో రేవంత్ కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే1 లోగా వివరణ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టీపీసీసీ ట్విట్టర్ హ్యాండిల్ అమిత్ షా కు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లు గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం గడువు కోరగా… కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగానికి చెందిన కొందరిని గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని… కరెంటు కోతలతో యూనివర్సిటీకి సెలవు ప్రకటించారని BRS నేత మన్నె క్రీశాంక్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన గతంలో సైతం పలుమార్లు అరెస్టు కావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మపురం మండలానికి చెందిన BRS సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సల్వాజి మాధవరావు పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. అలాగే అతనిపై కేసు పెట్టడంతో జైల్ పాలయ్యారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా మూలంగా అనేక కేసులు నమోదవుతున్నాయి. ఇకనుండి సోషల్ మీడియా లో పోస్ట్లు పెట్టే యూజర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కంటెంట్ పోస్ట్ చేయాలని నేటి గద్దర్ న్యూస్ సూచిస్తుంది.

🌎ఐటీ చట్టం 66 (ఎ) – నిబంధనలు🌏

ఐటీ చట్టం 66 (ఎ) నిబంధనల ప్రకారం 1) కంప్యూటర్ను గానీ, ఇతర సమాచార పరికరాన్ని గానీ ఉపయోగించి ఇతరులకు హానికర, అభ్యంతరకర సమాచారాన్ని చేరవేయడం నేరం. 2) ఒక సమాచారం తప్పు అని తెలిసినప్పటికీ ఇతరులకు కోపం, అసౌకర్యం, ప్రమాదం, అడ్డంకి కలిగించే నేరపూరిత ఉద్దేశంతో శత్రుత్వం, ద్వేష భావంతో కంప్యూటర్ ద్వారా దాన్ని వినియోగించకూడదు. 3) ఇతరులకు అసౌకర్యం కలిగించేలా లేదా తప్పుదారి పట్టించేలా ఏదైనా ఇ-మెయిల్ను వాడుకున్నా ఈ సెక్షన్ కింద మూడేళ్లవరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.

సెక్షన్ 66 (ఎ) ఎందుకు చెల్లదు?

ఈ సెక్షన్ అనేక పర్యాయాలు దుర్వినియోగం అయింది. అందువల్లే న్యాయ స్థానం కొట్టివేయాల్సి వచ్చిందన్నది వాస్తవం. ఈ చట్టం కింద ఎందరో బాధితులు పలు ఇబ్బందులు పడ్డారు. అందుకు నిదర్శనాలు కొన్ని….

⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

సెక్షన్ 66 (ఎ) ఎందుకు చెల్లదు?

ఈ సెక్షన్ అనేక పర్యాయాలు దుర్వినియోగం అయింది. అందువల్లే న్యాయ స్థానం కొట్టివేయాల్సి వచ్చిందన్నది వాస్తవం. ఈ చట్టం కింద ఎందరో బాధితులు పలు ఇబ్బందులు పడ్డారు. అందుకు నిదర్శనాలు కొన్ని….

• 2012లో శివసేన అధినేత బాల్ థాకరే మృతికి నిరసనగా బంద్ను చేపట్టారు. ఈ చర్యపై పూణెకు చెందిన దాదాషాహిన్ అనే అమ్మాయి ఫేస్బుక్లో ప్రశ్నంచగా, మరో అమ్మాయి రినూ శ్రీనివాసన్ దానికి మద్దతు తెలిపింది. వీరిద్దరి అభిప్రాయాలను తప్పుబడుతూ పోలీసులు వారిద్దర్నీ అరెస్ట్ చేశారు.

• తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిమమతాబెనర్జీపై వ్యంగ్య చిత్రాలను పెట్టినందుకు జాదవ్్పూర్ విశ్వ విద్యాలయ అధ్యాపకుడు అంబికేశ్ను అరెస్ట్ చేశారు.

• పార్లమెంట్, రాజ్యాంగం సమర్థంగా పనిచేయడం లేదంటూ అసీమ్ త్రివేది కార్టూన్లు వేయడంతో రాజద్రోహం నేరంపై 2012లో ఆయన్ని అరెస్టు చేశారు.

• సమాజ్వాదీ పార్టీ నేత అజంఖాన్పై అవినీతి ఆరోపణలు చేసినందుకు కన్వాల్ భారతి అనే విద్యార్థినిని 2013లో అరెస్ట్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !