+91 95819 05907

Adilabad:పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.

— కేంద్ర ఎన్నికల డిప్యూటి కమిషనర్ నితేష్ కుమార్.
నేటి గద్ధర్ న్యూస్ ,అదిలాబాద్(మే2) బ్యూరో : ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి తెలంగాణ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు.సందర్బంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారాలను ఆదేశించారు.ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పట్లు పూర్తి చేయాలనీ సూచించారు.జిల్లాల వారిగా ఎన్నికల ఏర్పాట్ల వివరాలపై సమీక్షించారు.ఈవీఎం ల ర్యాండమైజేషన్ ఓటరు గుర్తింపు పత్రాల పంపిణీ పోలింగ్ కేంద్రాల్లో మౌళిక సదుపాయాల కల్పన వెబ్ కాస్టింగ్ సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు, పోలీసు బందోబస్తు తదితర అంశాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రెండు గంటలకు తప్పకుండా ఖచ్చితమైన పోలింగ్ శాతపు వివరాలు పంపాలని తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేయాలన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.ఓటింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి నిర్మల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల సిబ్బందికి రెండో విడత అవగాహనా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో పోలీసు శాఖ వారి సమన్వయంతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని వివరించారు.అనంతరం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిళ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నర్వహణకు పటిష్ఠ బద్రతను కల్పిస్తున్నామని అన్నారు. 48 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని అదనపు పోలీస్ బద్రతను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ డీఆర్వో భుజంగ్ రావ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !