★ఇప్పటికే గోసపడుతున్నాం.. మళ్ళీ మోసపోవద్దు
★ ఇచ్చంపల్లి జలాలు పక్క రాష్ర్టంలో కి తరలి వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు
★ గోదావరి జలాలపై కేంద్రానికి హక్కులు కల్పించారు
★కొత్త జిల్లా లు తీసేస్తాం అంటున్నారు
★ బంధు పథకాలు బంద్ అయినాయి
★ వడగండ్ల వానతో రైతులు నష్టపోయిన ఈ ప్రభుత్వానికి సోయి లేదు
★ పోడు పట్టాల ఊసే లేదు
★KCR ని తిట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకావడం లేదు
★ ప్రజలు నమ్మడం లేదని ఓట్ల కోసం దేవుళ్లపై ఓట్లు
★ ఆరు గ్యారెంటీలు , 420 పథకాలను అమలు కోసం నిలదీయాలన్న BRS పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
★ భద్రాచలంలో విలేకరుల సమావేశంలో BRS పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఓటుకు నోటు కేసులు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవడం ఖాయం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జోస్యం చెప్పారు.శుక్రవారం భద్రాచలంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్పు కావాలి మార్పు కావాలి అని ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూలంగా గత కొన్ని నెలల నుండి గోసపడుతున్నాం.. మళ్ళీ మోసపోవద్దు అని రేగ కాంతారావు ప్రజలను కోరారు. ఇచ్చంపల్లి జలాలు పక్క రాష్ర్టం కి తరలి వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు.. నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరి జలాలపై కేంద్రానికి హక్కులు కల్పించి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. పాలన అందరికీ దక్కాలని సదుద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే కొత్త జిల్లా లు తీసేస్తాం అని కాంగ్రెస్ పాలకులు మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన బంధు పథకాలు కొద్ది నెలల్లోనే
బంద్ అయినాయి అని అన్నారు. వడగండ్ల వానతో రైతులు నష్టపోయిన ఈ ప్రభుత్వానికి సోయి లేదు.పోడు పట్టాల ఊసే లేదు. పాలన చేతకాక KCR ని తిట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకావడం లేదు అని ప్రభుత్వ పనితీరును దుయ్యబట్టారు. ప్రజలు నమ్మడం లేదని ఓట్ల కోసం దేవుళ్లపై ఓట్లు ఓట్లు వేయడం సిగ్గుమాలిన చర్యగా వర్ణించారు. ప్రజలకు ఎన్నికల హామీలో భాగంగా అమలు గాని హామీలు గుప్పిచ్చారని…
ఆరు గ్యారెంటీలు , 420 పథకాలను అమలు కోసం నిలదీయాలన్న BRS పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు మహబూబాద్ ఎంపీ మాలోత్ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం రాంబాబు దొర, భద్రాచలం నియోజకవర్గం నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
