*ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి*
*ఎన్నికల అబ్జర్వర్ డా. సంజయ్ జి కోల్టే ఐఏఎస్*
నేటి గదర్ న్యూస్,బోనకల్ : త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎన్నికల అబ్జర్వర్
డా. సంజయ్ జి కోల్టే ఐఏఎస్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముష్టికుంట్ల చిరునోముల, చొప్పకట్లపాలెం లలోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. గ్రామాల్లోని హోమ్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మండల కేంద్రంలోని సరిహద్దు ఎన్నికల చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి ఎన్నికల రికార్డులను ఆయన పరిశీలించారు. ఆంధ్ర నుండి వచ్చే ప్రతి వాహనాన్ని పకడ్బందీగా తనిఖీలు చేపట్టి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు ఆయన వెంట తహశీల్దార్ వున్నం చందర్, ఎంపీడీవోఎల్ రాజు, ఎంపీఓ శాస్త్రి, గిరిధావర్ గుగులోతు లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు దామల్ల కిరణ్, బోయినపల్లి శ్రీను, బంధం అర్జున్, రఘు బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.