నేటి గదర్ న్యూస్,ములుగు:
*కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకులు…*
*దేశావ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ తోనే సాధ్యం…*
*అధికారంలోకి రాగానే దేశావ్యాప్తంగా రైతు రుణమాఫీ కాంగ్రెస్ చేసి తీరుతుంది…*
*ఎస్సి,ఎస్టీ,బీసీ బడుగుబలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ రద్దు చేసే ఆలోచనలో బీజేపీ…*
*రాజ్యాంగం పరిరక్షణ కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చెయ్యాలి…*
*రాష్ట్రంలో, కేంద్రంలో లేని బి.ఆర్.ఎస్ కు ఓటు వేస్తే ప్రయోజనం లేదనేది ప్రజలు గ్రహించాలి….*
తేది :03.05.2024 అనగా ఈ రోజున పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాలమేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి సూచనలమేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు గారి ఆధ్వర్యంలో ఏటూరునాగారం టౌన్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి నియోజకవర్గ కోర్డినేటర్ & బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల ఇంచార్జిలు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు అయూబ్ ఖాన్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య ముఖ్యఅతిధులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చిటమట రఘు గారు మాట్లాడుతూ బీజేపీ పడేండ్ల పాలనలో దేశాన్ని సర్వ నాశనం చేసింది, ప్రభుత్వ ఆస్తులను నరేంద్రమోడీ అమ్మేస్తున్నారని,పేదలకు, యువత కు,రైతులకు పూర్తి వ్యతిరేకంగా పడేండ్లలలో బీజేపీ ప్రభుత్వం నడుచుకుందని, మతాల పేరుతో ప్రజల మధ్యలో గొడవలు సృష్టించారాని అన్నారు.ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ దోస్తులకు కట్టబెట్టి ప్రజలను పీక్కుతిన్నారని అన్నారు.ఎస్సి, ఎస్టీ, బీసీ బడుగుబలహీనవర్గాల రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనలు బిజెపి ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో కేంద్రంలో లేని బి.ఆర్.ఎస్ కు ఓటు వేస్తే ప్రయోజనం లేదనే విషయాన్ని ప్రజల గ్రహించాలని అన్నారు, కాంగ్రెస్ దేశం అంతటా రైతు రుణమాఫీ చేసి తీరుతుందన్నారు, దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని అన్నారు. రాజ్యాంగం పరిరక్షణ కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని అన్నారు.
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు చేసే అయిదు గ్యారంటీ లు
1.యువ న్యాయం ₹1 లక్ష వేతనం చదువుకున్న యువతకు ఖచ్చితమైన మొదటి ఉద్యోగం…
2.రైతు న్యాయం రుణ మాఫీ మరియు స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధర (MSP) కి చట్టపరమైన హోదా…
3.సామాజిక న్యాయం జన గణన ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కుల గణన…
4.నారీ న్యాయం ₹1 లక్ష ప్రతి సంవత్సరం ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు…
5.శ్రామిక న్యాయం 400 ప్రతి రోజు | జాతీయ ఉపాధి హామీ కూలీలతో సహా దేశవ్యాప్తంగా కార్మికులందరికీ జాతీయ రోజువారి కనీస వేతనం కల్పిస్తుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాలు, మాజీ ప్రజాప్రతినిధులు, సహకార సంఘం నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.