+91 95819 05907

ఎన్నికల మజా కనపడడం లేదు.గ్రామాల్లో కనిపించని ఎన్నికల సందడి…

◆పసలేని ఎన్నికలు పండుగా…

◆జాడ లేని పోటీ పడుతున్న అభ్యర్థులు…

నేటి గద్దర్ ప్రత్యేక ప్రతినిధి(మే 4):
✍️నైనారావు నాగేశ్వరరావు
📱 78935 38668
ఎన్నికలంటే ఓ పండగ లెక్క! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు.. ర్యాలీలూ.. సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభా ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది.కానీ,ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు.ప్రచార హోరు కనిపించకపోగా..మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో ఈ హుషారు కనిపిస్తున్నా..ఊళ్లో మాత్రం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం చప్పుడే లేకుండా పోయింది.కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు ప్రధాన అనుచరులు మరీ రాలేదనకుండా గ్రామ స్థాయిలో ప్రచారం చేసి వస్తున్నారు…

పసలేని ఎన్నికలు పండుగా…

గ్రామాల్లోనే కాదు..స్థానిక నేతల్లో కూడా పెద్దగా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు.ప్రధానంగా పోటీ పడుతున్న బిఆర్‌ఎస్,కాంగ్రెస్, బిజేపీ నాయకుల్లోనూ ఇదే స్తబ్ధత నెలకొంది.ఏ ఎన్నికలు వచ్చినా.. అభ్యర్థులు లేదా ప్రజాప్రతినిధులు మండలాలు, గ్రామాల వారీగా తమ నాయక గణానికి బాధ్యతలు అప్పగిస్తుంటారు.ప్రచార బాధ్యతలు వారే చూసుకోవాల్సి ఉంటుంది.వారిపై మరికొందరు సమన్వయం చేస్తుంటారు.కానీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఇప్పటికీ నాయకులకు అప్పగించలేదు.అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులతోపాటు ఆయా పార్టీల సర్పంచ్‌లు కూడా గ్రామాల్లో సందడి చేయడం లేదు.బయటకు వెళ్తే ఎక్కడ ఖర్చుల భారం మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.ఒకవేళ వెళ్లినా మైకుల హోరు..ర్యాలీలు నిర్వహించడం లేదు. సాదాసీదాగా వెళ్లి గ్రామస్తులతో సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నారు.మొత్తం మీద ప్రచారం మా మా అనిపిస్తున్నారన్న మాట…

అప్పుడే మస్తుగుండే…

ఎంపీ ఎన్నికలంటున్నారు.మరీ మందూ లేదు.. విందూ లేదా..అని చాలా మంది నాయకులకు మందుబాబుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.పల్లెల్లో నాయకులు ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇది కూడా కారణంగా మారుతోంది. శాసనసభ,ఎన్నికల్లో మద్యం జోరుగా సరఫరా కావడంతో.. మందుబాబులందరికీ ప్రచారం జరిగినన్ని రోజుల పండగలా సాగింది.స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నాయకులు ఇంటికొచ్చి మరీ.. మద్యం సీసాలను మందుబాబులకు అప్పగించి వెళ్లారని సమాచారం.ఇప్పడేమో అంతా స్థబ్దతగా ఉంది.ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ఊళ్లలో ప్రచారం చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నారు.ఒకవేళ ప్రచారం చేసేందుకు వెళ్లకున్నా,పై నుంచి డబ్బులు వచ్చినా ఖర్చు పెడతలేరు అన్న అపవాదూ వస్తోందని వాపోతున్నారు.

6 రోజులే మిగిలింది…

పార్లమెంట్‌ ఎన్నికలకు ఇంకా ఐదురోజులే మిగిలింది.మే నెల 13న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.ప్రచారాన్ని ఈ నెల 11 వరకు మాత్రమే చేయాల్సి ఉంది.ఇప్పటి దాకా పల్లెల్లోకి అభ్యర్థులే ప్రచారానికి రాలేదు.కేవలం పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు,మేజర్‌ మండల కేంద్రాల వరకే తమ ప్రచారాన్ని పరిమితం చేస్తున్నారు.కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మేజర్‌ ఓట్లు ఉన్న గ్రామాల్లో కార్యకర్తలు, గ్రామస్తులు నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా, అందాల్సినవి అందకపోవడం వల్లే ప్రచారం మాగబోయిందనే చర్చ గ్రామాల్లో వినిపిస్తోంది.

సంఘాల వారీగా…

అభ్యర్థులు శాసనసభా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు.గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో కుల సంఘాల వారీగా కలుస్తున్నారు.కులం ఓట్లు గంపగుత్తగా తమకే వేసేలా వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల నాయకులకు వారు కోరిన కోర్కెలకు హామీలు ఇస్తున్నారు.తాము గెలవగానే మీ హామీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు.పార్లమెంట్‌ స్థానం పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలు,మంత్రులు,స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధుల పైనే పూర్తిగా ఆధారపడుతున్నారు.ఇక అభ్యర్థులు, పార్టీలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తేనే స్థానిక నాయకులు ప్రచారానికి ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !