+91 95819 05907

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు బి ఆర్ ఎస్ ను ఆదరించలేదు:CM రేవంత్ రెడ్డి

అధిక మెజారిటీ ఇచ్చే స్థానంగా ఖమ్మం చరిత్రలో నిలుస్తుంది
– ఖమ్మం ప్రజలు కాలకూట విషాన్ని ముందే గుర్తించారు
– అందుకే 2014, 19, 23 ఎన్నికల్లో బిఆర్ఎస్ దూరం పెట్టారు
– నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్ ని మించినోడు లేడు
– డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్… మే 13న జరగనున్న ఎన్నికలు ఫైనల్స్
– జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

నేటి గదర్, మే 04, భద్రాద్రి కొత్తగూడెం :

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అధిక మెజారిటీ ఇచ్చే స్థానంగా ఖమ్మం జిల్లా చరిత్రలో నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన జన జాతర మహాసభలో వేలాదిమంది కార్యకర్తలు పాల్గొనగా సభకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు పోరాటాల గడ్డగా పేరుందని, ఆనాడు 1969లో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రాంతంలో మొదలైంది అన్నారు. ఖమ్మం ప్రజల ప్రారంభించిన పోరాటం వల్లన తెలంగాణ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నక్కజిత్తుల, నయవంచన, కాలకూట విషం కేసీఆర్ వైఖరిని ఖమ్మం ప్రజలు ముందే పసిగట్టారు అని సీఎం రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని జరగనున్న మార్పులను ముందే అంచనా వేయగలరని, అందుకే 2014, 19, 23 ఎన్నికల్లో బిఆర్ఎస్ ను దూరం పెట్టారని ఆయన తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచే స్థానంగా ఖమ్మం చరిత్రలో నిలబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఈ రోజున గూడుపుఠాణి జరుగుతుందని, అంతర్గతంగా ఒక అవగాహనతో కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రను తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఖమ్మం, మహబూబాబాద్ కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు. కారు కార్ఖానాకు పోయింది.. మళ్లీ వస్తుంది అని కేసీఆర్ చెప్తున్నారు కానీ, కారు కరాబ్ అయిందని.. తూకానికి తెగనమ్మాల్సిన సమయం వచ్చిందని రేవంత్ అన్నారు. నమ్మించి మోసం చేయడంలో కెసిఆర్ ను మించిన వాళ్లు లేరని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ బిజెపిలో చేరుతారని మేము మొదటి నుంచి చెబుతున్నామని, కెసిఆర్ కేంద్రంలో ఏ సంకీర్ణంలో చేరుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో భాజాపా చేసిన అన్ని చట్టాలకు బారాస మద్దతు ఇచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బిజెపికి కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని ఆయన అన్నారు. 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని మాకు ఇచ్చారని సీఎం రేవంత్ అన్నారు. బట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కాబట్టి నిధులు సర్దుతున్నారని, అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈనెల 9లోగా ఒక రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతానన్నారు రేవంత్ రెడ్డి. రైతులకు బకాయి లేకపోతే ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భద్రాచలం రాముల వారి సాక్షిగా పంద్రాగస్టు నాటికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానన్నారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ అమలు చేసి, హరీష్ రావు నోరు మూయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా, కరెంటు కోతలు, పింఛన్లపై అబద్దాలు చెప్తున్నారు అని రేవంత్ మండపడ్డారు. రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని రేవంత్ తెలిపారు. బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుందని, రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్ ఆరోపించారు. బిజెపికి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని, కాంగ్రెస్కు ఓటు వేస్తే రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయని రేవంత్ అన్నారు. బిజెపికి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై పోటుగా మారుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు కేవలం సెమీఫైనల్స్, మే 13న జరగనున్న ఎన్నికలు ఫైనల్స్ అని రేవంత్ అన్నారు. ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం ఉంటుందని, గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే… తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ నాయకత్వం వహించబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గుజరాత్ ను ఓడిద్దాం తెలంగాణను గెలిపిద్దాం రండి అంటూ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో రఘురాంరెడ్డిని, మహబూబాబాద్ లో బలరాం నాయక్ ని గెలిపించాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 5

Read More »

 Don't Miss this News !