కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు
ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా సమాచారం సేకరిస్తుందని, ఇందులో కొత్తేముందని వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి పరమేశ్వరన్
సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక అధికారినే నియమించి, అనధికార ప్రత్యేక దర్యాప్తు చట్టం(సిట్)ను ఏర్పాటు చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విపక్ష నేత ఆర్.అశోక్
సీఎం కుర్చీ రక్షణ కోసం సొంత ఎమ్మెల్యేల కదలికలపై సిద్దరామయ్య నిఘా వేసినట్లు ఆరోపించిన కేంద్రమంత్రి కుమారస్వామి
పాలు, తేనెల్లాంటి డీకే శివ కుమార్‌కు, నాకు మధ్య ఉన్న బంధాన్ని విడగొట్టడానికి విమర్శలు చేస్తున్నారని జవాబిచ్చిన సిద్దరామయ్య
నాకు ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదని, సీఎం కుర్చీ ఖాళీ అయిన తర్వాతే తన ప్రయత్నాలు మొదలవుతాయని తెలిపిన డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్








