+91 95819 05907

మహబూబాద్ BRS దే: మణుగూరు ZPTC పోశం

మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని చిట్టయ్య గుంపులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ…..
తెలంగాణ రాష్ట్రలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేసిందని అన్నారు, కెసిఆర్ ప్రభుత్వం కంటే మెరుగైన పథకాలు అని కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు గాని కేసీఆర్ పై తిట్లు దేవుళ్ళపై ఓట్లు తో వేస్తూ కాలం వెళ్లదిస్తూ ఈ ఐదు నెలల కాలం లోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత మొదలైందని మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుతున్నారని అన్నారు,కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం కాదు కదా తుప్పు పట్టిన ఇనప ముక్కను కూడా ఇవ్వదని అన్నారు, పాత పెన్షన్ల్లు తప్ప కొత్త పెన్షన్లు ఊసే లేదు, రైతులకు 15 వేల పథకం పత్తా లేదు, పల్లెల్లో కరెంటు కోతులు, పట్టణాల్లో నీటి కోరతలు ఉన్నాయని,కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రన్ని అధోగతి పాలు చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన అని అన్నారు హడావుడిగా ఆమలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరించబడటం ఖాయమని అన్నారు. తెలంగాణ గొంతుకైనా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రo అభివృద్ధి చెందుతుందని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత గారి ***#కారు గుర్తుపై ****# ఓటేసి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సమావేశంలో కూనవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు తాటి సరిత, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు కాటిబోయిన సుజాత, మణుగూరు మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రామసహాయం వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామిడి రామరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు, బర్ల సురేష్, కంభంపాటి శ్రీను, కూనవరం గ్రామం పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంకా అర్జున్ రావు, జట్పట్ వెంకన్న , పాయం కృష్ణారావు, ముత్తయ్య ఎనిక రాంబాబు, ఎనిక ముత్తయ్య, ఏనిక లక్ష్మి, ఇమ్మడి పద్మ, బూరక సుశీల, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !