★బాధితుడి చిరునామా సేకరించిన పినపాక వాసి SK రహీం
★కృతజ్ఞతలు తెలిపిన బాధిత వ్యక్తి ,రేగా అనుచరుడు పూజారి కృష్ణ
నేటి గద్ధర్ న్యూస్,పినపాక:రోడ్డు పై వెళ్తుండగా దొరికిన పర్సు ను ఓ వక్తి మరో వ్యక్తి సహాయం తో బాధిత వ్యక్తికి అప్పగించిన సంఘటన సోమవారం చోటు పినపాక లో చోటు చేసుకుంది. కరకగూడెం మండల వాసి పూజారి కృష్ణ తన సొంత పనిపై సోమవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు కి వెళ్లడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రంగాపురం ఏడూళ్ళ బయ్యారం ప్రధాన రహదారి భూపాలపట్నం గ్రామం వద్ద పూజారి కృష్ణ కి చెందిన పర్సు తన పాయింట్ జేబులో నుండి కింద పడిపోయింది. ఇది గమనించని ఆయన వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో ఆయన వెనుకాల వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు పర్సు కనిపించినప్పటికీ ని దానిని చూసి వదిలేసి బాధిత వ్యక్తికి తెలిపాడే తప్ప పర్సు మాత్రం తీసుకోలేదు. ఆ సమయంలోనే భూపాలపట్నం కి చెందిన చిరు వ్యాపారస్తుడు కొమరం సాంబయ్య ఆ సమయంలో ఆ పర్సు ని గమనించి దానిలో లభించిన వివరాలు ఆధారంగా తన స్నేహితుడు పినపాక మండల వాసి SK రహీం కి సమాచారం అందించారు. SK రహీం తక్షణమే స్పందింది కరకగూడెం లో తన మిత్రునికి సమాచారం అందించాడు.ఆ వ్యక్తి ద్వారా బాధిత వ్యక్తి పూజారి కృష్ణ వివరాలు సేకరించి పినపాక లో కొమరం సాంబయ్య ,SK రహీం ఇద్దరు కలిసి దామోదర్ ఫ్యాన్సీ & జనరల్ స్టోర్స్ పినపాక వద్ద ఆ పర్సు లో ఉన్న రూ.2వేలు ,క్రెడిట్ ,డెబిట్ కార్డులు గంటల వ్యవధిలో అప్పగించారు.దొరికిన పర్సు ను బాధిత వ్యక్తి కి అప్పగించిన కొమరం సాంబయ్య మంచి మనసును ,అందుకు సహకరించిన Sk రహీం ను పలువురు అభినందించారు.
