పోరిక బలరాం నాయక్ గెలుపు సాధ్యమేనా..?
బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవితకు గెలుపు నల్లేరు మీద నడకేనా?
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (మే 6):
నైనారపు నాగేశ్వరరావు ✍️
మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి అభ్యర్థుల ప్రచారాలు నామమాత్రంగానే జరుగుతున్నాయి.వివిధ పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ,నియోజకవర్గ,మండల స్థాయి నాయకులుపై ఆధారపడి గెలుపు సైతం మాదేనంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని మానుకోట పార్లమెంటు స్థానం పోరిక బలరాం నాయక్ గెలుపు నాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మానుకోట పార్లమెంటు పరిధి మూడు జిల్లాలతో కూడి ఉంది. మహబూబాబాద్,భద్రాద్రి కొత్తగూడెం,ములుగు జిల్లాతో ముడిపడి ఉంది.ఏడు నియోజకవర్గాలతో విస్తరించి ఉంది.మహబూబాబాద్,డోర్నకల్, నర్సంపేట,ఇల్లందు,భద్రాచలం,పినపాక ములుగు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు సుమారుగా 15 లక్షల మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఆ పార్టీ ఆరు గ్యారెంటీలతో గెలుపు దీమా వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో వలస వచ్చిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారని గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందు నుండి కాంగ్రెస్ పార్టీని అంటూపెట్టుకొని క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదని పార్లమెంట్ స్థాయిలో క్షేత్రస్థాయి కార్యకర్తలు నాయకులు అంతర్మాదనంలో కొట్టుమిట్టాడుతున్నారు.కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత కలయికల వలన కాంగ్రెస్ పార్టీలో కోవట్ల కుంపటి నడుస్తుందని కాంగ్రెస్ శ్రేణులే బహిర్గతంగా చర్చించుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆరు గ్యారంటీల్లో ఒక్క గ్యారెంటీ మహిళలకు బస్సు ఫ్రీ తప్ప ఐదు గ్యారెంటీలు కూడా పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతుంది.కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నాయకుల్లో కార్యకర్తల్లో పార్టీ నాయకత్వం మీద నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. కాంగ్రెస్ కేడర్లో అసంతృప్తి మూట కట్టుకుంటుంది.పోరిక బలరాం నాయక్ సిపిఐ,సిపిఎం,టిడిపి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.సిపిఐ,సిపిఎం,టిడిపి పార్టీ నాయకులను కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వివిధ పార్టీల క్యాడర్లు గుసగుసలాడుకుంటున్నారు.
బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవితకు గెలుపు నల్లేరు మీద నడకేనా?
రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ బిఆర్ఎస్ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో విశ్వాసం ఉందని ఆ విశ్వాసమే మానుకోట పార్లమెంటు అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు నల్లేరు మీద నడికేనని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు పోడుపట్టాలు ఇచ్చి రైతులను ఆదుకున్న చరిత్ర బిఆర్ఎస్ పార్టీకి ఉందని అదే కాకుండా వృద్ధాప్య, వితంతువు,ఒంటరి మహిళలకు పింఛన్లు, మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లాంటి పథకాలే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితను గెలిపిస్తుందని పార్టీ క్యాడర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో కోవట్ల లొల్లి పెరిగిందని,క్షేత్రస్థాయి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అసంతృప్తి బిఆర్ఎస్ పార్టీకి దోహదపడుతుందని నాయకులు, కార్యకర్తలు,తెలంగాణ ఉద్యమ నాయకులు పలుచోట్ల రచ్చబండ కేంద్రాలలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి.బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు మరియు కాంగ్రెస్ పార్టీలో కోవట్ల అలజడి కాంగ్రెస్ పార్టీలోనే క్షేత్రస్థాయి నాయకులు కార్యకర్తలు అసంతృప్తులు బిఆర్ఎస్ పార్టీ మానుకోట పార్లమెంటు అభ్యర్థి మాలోత్ కవిత గెలుపుకు సాధ్యపడేనా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే…