నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో T. PCC అధ్యక్షులు,తెలంగాణ CM రేవంత్ రెడ్డి బిజెపి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బిజెపి పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీ G. ప్రేమేందర్ రెడ్డి కొత్తగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 4 న భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన జన జాతర సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
★ సీఎం రేవంత్ రెడ్డి బిజెపి పైన చేసిన కామెంట్స్
★ నేను ముందు నుండే చెబుతున్న భారత రాజ్యాంగాన్ని మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 సీట్లు అడుగుతుంది
★ నేను ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ కుమార్ రెడ్డిని, బండి సంజయ్ ని ఇక్కడ నుండి అడుగుతున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్యాంగం మారుస్తుందని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు
★ దళితులకు, బీసీలకు, బలహీన వర్గాలకు, ఎస్సీ , ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర కేంద్రంలో జరుగుతుంది
★ మీకు ఇచ్చే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి
★ మీరు బిజెపికి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి అని కేంద్ర ప్రభుత్వంపై ఇష్టారీ తిన రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు ,చట్టవిరుద్ధమైన మరియు రెచ్చగొట్టే ప్రకటనలు , నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి పిటిషన్లో పేర్కొన్నారు. ఏది ఏమైనాప్పటికీ 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హాట్ గా సాగుతుంది.