+91 95819 05907

హత్యలకు,ఘర్షణ లకు కేంద్రం గా మద్యం బెల్ట్ షాపులు.

విచ్చలవిడిగా బెల్ట్ షాపులు…

★..

★బెల్ట్ షాప్ ల వద్ద తీవ్ర ఘర్షణలు జరుగుతున్న ఎక్సైజ్ శాఖకి పట్టదా?
★మద్యం బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి:యాదగిరి గౌడ్, BRS నాయకులు, మణుగూరు
★చర్యలు తీసుకుంటాం:Excise CI రాజీ రెడ్డి

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (మే 7)(మణుగూరు):
నైనారపు నాగేశ్వరరావు ✍️
7893538668

ఏజెన్సీలో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడిపించడం వలన అనేక మంది మరణాలకు నిలయంగా బెల్ట్ షాపులు ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉండడం వలన అనేక మంది మరణాలకు,హత్యలకు నిలయాలుగా ఉండడం వలన మందు బాబుల ఘర్షణలకు కారణమౌతున్నాయని పలువురు రాజకీయ నాయకులు మేధావులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.గత కొంత కాలం క్రితం మణుగూరు మండలంలోని మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో మద్యం మత్తులో ఒకరికి ఒకరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు ఏర్పడి అదే గాంధీ బొమ్మ సెంటర్లో ఇండ్లను తగల బెట్టుకోవడం జరిగిన సంఘటనలు ఉన్నాయని దాని వలన పలు కుటుంబాలు వీధిన పడి జైళ్ళ పాలు అయినటువంటి సంఘటనలు ఉన్నాయని పలు రాజకీయ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.అదే కాకుండా మణుగూరు పీకే వన్ సెంటర్లో ఈ నెల 5న మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న బెల్ట్ షాప్ ముందు హత్యాయత్నం జరిగిన సంఘటన అనంతరం మండల ప్రజానీకం మహిళలు యువతు లు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సిండికేట్ వ్యాపారులను ప్రోత్సహించడం వలన ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిలుస్తున్నాయని వాటి వలన మద్యానికి బానిసైన మందుబాబుల కుటుంబాలు చిన్నాభిన్నమై పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.రెక్కాడితే గాని డొక్కాడని వందలాది పేద కుటుంబాలు వీధిన పడడమే కాకుండా,హత్యలు,హత్యా యత్నాలు,ఘర్షణలు జరగడానికి కారకులు మద్యం సిండికేట్ యాజమాన్యాలేనని వారి హత్యలకు పూర్తి బాధ్యత ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు సిండికేట్ యాజమాన్యాలే బాధ్యత వహించాలని పలు మహిళా సంఘాల నాయకురాలు,బాధిత మహిళలల కుటుంబాల వారు,రాజకీయ పార్టీల నాయకులు,మేధావులు డిమాండ్ చేస్తున్నారు.మరోపక్క పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బెల్ట్ షాపులు బందు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యహరించడం పట్ల పలువురు మండిపడుతున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని రాజకీయ పార్టీల నాయకులు మేధావులు సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారుల పట్ల విమర్శనాస్త్రాలు సిద్ధిస్తున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారులు సిండికేట్లతో కుమ్మక్కై వారిచ్చే కాసులకి కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని పలువురు మండిపడుతున్నారు.

💥💥💥💥💥💥💥💥
మద్యం బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలి:బిఆర్ఎస్ మణుగూరు పట్టణ సీనియర్ నాయకులు:తాళ్లపల్లి యాదగిరి గౌడ్.

మణుగూరు పట్టణంలో మద్యం బెల్టు షాపులు విచ్చలవిడిగా నడిపిస్తున్నారని వాటి వలన ప్రజలు మద్యం సేవించే వారు ఆనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని పికే 1 సెంటర్లో ఘర్షణలకు దారితీస్తుందని,పేదల కష్టార్జితాన్ని మద్యం బెల్టు షాపుల యాజమాన్యాలు కొల్లగొడుతూన్నారని మండిపడ్డారు.పికే 1 సెంటర్లో ఉన్న బెల్టు షాపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.బెల్టు షాపులను ప్రోత్సహించే ఎక్సైజ్ శాఖ అధికారులపై, సిండికేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
💥💥💥💥💥💥💥💥
మణుగూరు Excise CI రాజీ రెడ్డిని నేటి గద్ధర్ న్యూస్ ప్రతినిధి ఫోన్ కాల్ లో సంప్రదించగా మణుగూరు మండలంలో అన్ని బెల్ట్ షాపులు మూసి వేయడం జరిగిందని, బెల్టు షాపుల నిర్వాహకులపై బైండోవర్ కేసులు పెట్టడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మిన, అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !