★ కూలిన ఇల్లు.. తప్పిన ప్రాణ నష్టం
★నిరు పేదల గూడు లు కూల్చేసింది
★ పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తా అంటున్నారు.గుడిసె కూలిపోయిన నిరుపేదలకు ఇవ్వరా?
★ ఇటీవల కురిసిన భారీ వర్షానికి సైతం నేలమట్టమైన పలు గుడిసెలు… మండు టెండలో చెట్ల కిందనే గడిపారు
★ప్రభుత్వం సహాయం చేస్తుందని గంపెడు ఆశ
నేటి గద్ధర్ న్యూస్,పినపాక:మండలంలోని పలు గ్రామాల్లో గాలి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సోమవారం రాత్రి బీభత్సం సృష్టించింది. మండలం లోని పలు గ్రామాల్లో గాలివాన ఉరుముల మెరులతో కూడి వర్షం పడింది. గాలికి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.పాతరెడ్డి పాలెం పంచాయితీ పరిధిలోని చింతల బయ్యారం గ్రామంలో అకాల వర్షానికి ముత్తేబోయిన వెంకటేశ్వర్లు పూరి ఇల్లు కుప్ప కూలింది.ప్రమాద సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో అక్కడ చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నాను. ప్రభుత్వం తమను ఆదుకోవాలని భాదితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇటీవలే కురిసిన భారీ వర్షానికి సైతం పలు నిరుపేదల ఇల్లు నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం సహాయం పైనే వారు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.