★ గత కొంతకాలంగా బీఆర్ఎస్ కి దూరంగా ఉంటున్న కంది
నేటి గద్ధర్ న్యూస్,పినపాక: BRS పార్టీ సీనియర్ నాయకులు, పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి బుధవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. గత ఎన్నికల్లో కంది సుబ్బారెడ్డి టిఆర్ఎస్ తరఫున సింగిరెడ్డిపల్లి నుండి ఎంపీటీసీగా గెలిచి… వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే కంది సుబ్బారెడ్డి కొంతకాలం నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం గౌడ్, ఉడుముల లక్ష్మారెడ్డి, గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, గట్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 326