ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా గ్యాస్ కంపెనీలు…
నిబంధనలను పాతరేస్తున్నా యాజమాన్యాలు…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 7:
నైనారపు నాగేశ్వరరావు✍️
7893538668
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లోని కొత్తగూడెం,ఇల్లందు, పాల్వంచ,అశ్వరావుపేట,భద్రాచలం, దుమ్ముగూడెం,చర్ల,సారపాక,అశ్వాపురం, మణుగూరు ప్రధాన పట్టణాల్లో ప్రజలు అత్యధికంగా నివసించే జనవాసాల మధ్య వివిధ గ్యాస్ కంపెనీలు గ్యాస్ గోడౌన్లు ఏర్పాటు చేయడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురై బెంబేలెత్తుతున్నారు.వేసవి కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో గ్యాస్ గోడౌన్లు ఇండ్ల మధ్యలో ఉండటం వలన ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.పేలుడు పదార్థాలకు సంబంధించిన గ్యాస్ గోడౌన్లను ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో అంటే ఊరి చివర్లో ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.కానీ,పలు గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు మాత్రం భద్రతా నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.జనావాసాలలో ఇష్టారాజ్యంగా గోడౌన్లను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు మేధావులు ముక్త కంఠంతో మండిపడుతున్నారు.ప్రధానమైన ఏజెన్సీల నుండి సబ్ ఏజెన్సీలు తీసుకొని ఎక్కడపడితే అక్కడ ప్రధాన రహదారులపై గ్యాస్ సిలిండర్లు పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తూ,నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.తదితర ప్రాంతాలలో ఏర్పాటైన గోడౌన్లే ఇందుకు నిదర్శనం.గ్యాస్ కంపెనీల పంపిణీదారులు గోడౌన్లను ఏర్పాటు చేసే ముందు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.కానీ ఇక్కడ మాత్రం గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు తమ పలుకుబడిని ఉపయోగించి నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని పలు ఆరోపణలు వెళ్ళు వెత్తుతున్నాయి.పెట్రోలియం ఎక్స్ ప్లోజిల్ సేప్టి ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఓసీ తోపాటు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.ఏదైనా ప్రమాదం సంభవిస్తే తమ పరిస్థితి ఏమిటని గోడౌన్ చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడిమికి గ్యాస్ గోడౌన్ లో ఎలాంటి ప్రమాదాలు జరిగిన దానికి పూర్తి బాధ్యత సంబంధిత అధికారులే వహించాలని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని జనావాసాల మధ్య నుంచి గోడౌన్లను తొలగించి పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు ప్రజాతంత్ర వాదులు కోరుతున్నారు.
.