మానుకోట గడ్డ కాంగ్రెస్ అడ్డ…
ఉపాధి హామీ పథకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే…
పొరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి…
కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు:సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం(మే 8):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు గొల్లగూడెం చొప్పాలా తుమ్మలగూడెం గ్రామపంచాయతీలలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను క్లుప్తంగా వివరించి మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కోరారు.
ఈ కార్యక్రమంలో
మండల నాయకులు ఎర్ర సురేష్, సిపిఎం మండలం కార్యదర్శి కొమరం కాంతారావు,తోలెం అప్పారావు,అంబోజు నరేష్,నాయకులు కార్యకర్తలు యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.