+91 95819 05907

మూడో విడతలోనే NDA విజయం వైపు : ప్రధాని మోదీ

నేటి గద్ధర్ వెబ్ డెస్క్:

మూడో విడతలోనే ఎన్డీఏ విజయం వైపు పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్​ ఎక్కడ గెలుస్తుందో బూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారని ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు హనుమకొండ నుంచే గెలిచారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలను తమ పార్టీని ఎన్నటికీ మరవలేదని వ్యాఖ్యానించారు. వరంగల్​ ప్రజలు ఎప్పుడూ బీజేపీకి మద్దతుగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు వరంగల్​లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ* పాల్గొన్నారు. వరంగల్​ లోక్​సభ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్​కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆరూరి రమేశ్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని మోదీ కోరారు. వికసిత్​ భారత్​ కావాలని, భారతదేశ​ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. *ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొన్నాయని,* *భారత్​ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం పొంచి ఉంటుందని* ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మరోసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని ప్రధాని మోదీ కోరారు. *కాంగ్రెస్​ ప్రభుత్వ పాలనలో పాపాలను ప్రజలు చూశారు.* *కాంగ్రెస్​ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి.* కాంగ్రెస్​ హయాంలో బాంబు పేలుళ్లు వంటి ఘటనలు చూశాం. *ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది.* ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? *రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్​ మోసగించింది. ఇప్పుడేమో ఆగస్టు 15 లోగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెబుతోంది.* *లోక్​సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ చేతులెత్తేయాలని చూస్తోంది.* అమరవీరులకు పింఛన్ల హామీని కాంగ్రెస్​ నెరవేర్చిందా? *మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ నెరవేర్చిందా?* విద్యుత్​ కోతలతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విశ్వాస ఘాతుకానికి పాల్పడిన కాంగ్రెస్​ ప్రజలకు మేలు చేస్తుందానని’ ప్రధాని మోదీ ప్రశ్నించారు.

*కాంగ్రెస్​ వచ్చాక ఖజానా ఖాళీ :* కాంగ్రెస్​ వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజల డబ్బులు ఎక్కడికి వెళ్తోందని ప్రశ్నించారు. *ఆర్​ఆర్​ ట్సాక్స్​ పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోందని* ఆరోపించారు. కాంగ్రెస్​ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదని అన్నారు. *మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉందన్న మోదీ,* కర్ణాటకలో బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారని మండిపడ్డారు. *ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్​ వెనకడుగు వేసిందని, ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని* మోదీ హామీ ఇచ్చారు. *తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశామని* వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
*బీజేపీ వచ్చాక ఎస్సీ వ్యక్తి రామ్​నాథ్​ కోవింద్​ను రాష్ట్రపతిగా చేశాం.* *రెండోసారి వచ్చాక ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశాం.* *ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును కాంగ్రెస్​ వ్యతిరేకించింది.* చాలా మంది ప్రజల శరీర రంగు నలుపు ఉంటుంది. *శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలి.* ద్రౌపది ముర్మును ఓడించాలని కాంగ్రెస్​ యత్నించింది. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని కాంగ్రెస్​ చూస్తోంది. శరీర రంగు ఆధారంగా యోగ్యత నిర్ణయిస్తారా?. *శరీర రంగు ఆధారంగా దేశ ప్రజలను అవమానించాలని అనుకుంటున్నారా?* . శరీర రంగు ఆధారంగా అవమానించాలని చూస్తే నేను ఎన్నటికీ సహించను.” అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !