+91 95819 05907

ఆ పథకం అబాసుపాలవుతుందా..?

– కూలీల కష్టాన్ని దోచుకుంటున్నారా..?
– 33 మందికి వచ్చిన నోటీసులతో తీరు మారిందా..?
– ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయా..?
– అవకతవకలకు అవకాశం లేకుండా మండల అధికారి అలర్ట్..?

నేటి గద్దర్, మే 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (ప్రతినిధి) (అలవాల వంశీ) :

దేశవ్యాప్తంగా రైతు వారి కూలీలకు పనులు లేని సమయంలో ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యంగా బూర్గంపాడు మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం సొమ్ము ఒకరిది… సోకు ఇంకొకరిది… అన్న చందంగా నవ్వుల పాలు అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పనులు లేక ఇబ్బంది పడుతున్న కూలీలకు ఉపాధి కల్పించి ఆసరాగా నిలిచేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆలోచనత్మకమైన పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. అయితే ఈ పథకం కొందరు అవినీతిపరులవల్ల అభాసుపాలు అవుతుందని స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకల పని దినాలపై చివరిగా సామాజిక తనిఖీ చేసిన సోషల్ ఆడిటింగ్ అధికారులు లోటు, పాట్లు గుర్తించారు. అదే సమయంలో మండల పరిధిలోని సుమారు 33 మంది అధికారులకు నోటీసులు అందిన విషయం కుడా విదితమే. ఓకే సమయంలో సుమారు 33 మంది అధికారులకు నోటీసులు అందిన విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీ అంశమైంది. 33 మంది అధికారులు తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కోవడం అంటే ఏ స్థాయి అవినీతి జరిగి ఉంటుందో అని పలువురు నేటికీ చర్చించుకుంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నోటీసులు అందుకున్న అధికారులు ప్రస్తుతం తమ తీరు మార్చుకున్నారా..? లేదా దారి మార్చుకొని అదే పాత పద్ధతిని కొనసాగిస్తున్నారా అనే ప్రశ్నలు సర్వత్ర ఉత్పన్నమవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరిగే లోటు పాట్ల కారణంగా షోకాజ్ నోటీసుల వర్షం లో పలువురు అధికారులు తడిసిపోవడంతో, ఈ ఏడాది ముందుగానే మండల అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు కనిపిస్తోంది, కాగ ఈ ఏడాది వచ్చిన నూతన మండల అధికారి పకడ్బందీగా ఉపాధి హామీపథకం పనిని జరిగే విధంగా ముందుకు వెళ్తున్నారు. కొందరు మేట్లు చేసే అవకతవకల కారణంగా ఈ ఏడాది ఉపాధిహామీ పని చేసే నిజమైన కూలీల పై ప్రభావం పడి రోజు కూలీ రూ.30/- నుండి రూ.60/- మాత్రమే ఈ ఏడాది పడుతున్నాయని వారు ఇప్పటికే ఇట్టి విషయం పై లబోదిబో మంటున్నారు. అయితే ఇందులో కొందరు మేట్ల స్వార్థం వలన కూలీలు నష్టపోవాల్సి వస్తుందని గ్రౌండ్ లెవెల్ అధికారులకు తెలిసినప్పటికీ తమ స్వలాభం కోసం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. పనికి రానివారికి.., ఇతర సంస్థలలో, శాఖలలో పనిచేస్తున్న వారికి సైతం కూలీలు వేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చేసిన పనికి వచ్చే ప్రతిఫలాన్ని కష్టపడిన వారితో సైతం పంచుకోవాల్సి వస్తుందని, ఎర్రటి ఎండలో గొడ్డు కష్టం చేస్తే వచ్చే కూలీలు సగం అవినీతి రాబందుల మయం అవుతుందని కూలీలు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో మరికొందరు అధికారుల సైతం నోటీసులు అందుకునే అవకాశం ఉంటుందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !