వాహనాల తనిఖీల్లో నగదు పట్టివేత.
పేరూరు పోలీసులకు అప్పగింత.
నేటి గద్దర్ వాజేడు
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మారం సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఎలక్షన్ కమిషన్ ప్లేయింగ్ స్క్యాడ్ తనిఖీలు నిర్వహించారు. సీ.జీ .వైపు నుండి వేగంగా వస్తున్న వాహనాన్ని స్కాడ్ అధికారి చంద్రశేఖర్, సిబ్బంది వాహనాన్ని నిలిపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి నగదు తరలింపు ఆధారాలు లేని, రెండు లక్షల పదిహేను వేల వంద రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పేరూరు పి.ఎస్ పరిధిలో వచ్చే పోయే వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న పేరూరు పి.ఎస్. సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి. రమేష్ కు ఎలక్షన్ కమిషన్ తనిఖీ ల అధికారి చంద్రశేఖర్ స్వాధీనం చేసుకున్న నగదు, ₹2లక్షల15వేల వంద రూపాయలు నగదును ఎస్.ఐ.కు అప్పగించారు. ఎలక్షన్ కమిషన్, పోలీస్ శాఖ నియమ నిబంధనల ప్రకారం ఆధారాలు లేని నగదును స్వాధీనం అంశంపై రికార్డుల పరంగా కేసు నమోదు చేసినట్లు తణికీల అధికారి చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. నగదు స్వాధీనం వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ నియమనిబంధనల ప్రకారం వీడియో రికార్డిండ్ నిర్వహించారు.