+91 95819 05907

మిట్ట గూడెం గురుకులం బాయ్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నకుమారి ని సస్పెండ్ చేయాలి:PDSU డిమాండ్

పురుగుల అన్నం… చాలి చాలని కూరలు.. నీళ్ళ పేరుగు శీర్షిక న నేటి గద్ధర్ లో గురువారం పబ్లిష్ చెయ్యడం జరిగింది.
నేటి గద్ధర్ న్యూస్, మణుగూరు:
విద్యార్థులకు భోజనం నాణ్యతతో పెట్టకుండా అన్నంలో పురుగులు వచ్చిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెట్టగూడెం గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నకుమారి ని సస్పెండ్ చేయాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృధ్వీ జిల్లా నాయకులు మునిగేలా శివ ప్రశాంత్ డిమాండ్ చేశారు. గురువారం కళాశాల విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని పి డి యస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా విద్యార్థులకు సరైన భోజనం అందించకుండా విద్యార్థులకు రావాల్సిన సీజనల్ ఫ్రూట్స్,బిస్కెట్స్, ఎగ్స్, విద్యార్థులకు ఇవ్వకుండా మాయం చేస్తూ అడిగిన విద్యార్థులను కక్షపూరితంగా టార్గెట్ చేసి బెదిరింపులకు గురి చేయడం, కళాశాల సిబ్బందితో విద్యార్థులపై ఒత్తిడి చేపించి విద్యార్థులను టీసీలు ఇచ్ఛి ఇంటికి పంపించే విధంగా గిరిజన విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం బాధాకరమని వారు అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలకు రెగ్యులర్ గా హాజరు కాకపోవడమే కాకుండా ఫుడ్ ఇంచార్జీ లను నియమించి వారి పని విధానంతో సరైన పరిశీలన లేకపోవడం వలన విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందకపోవడం వలన తీవ్రమైన ఎండల సమయంలో విద్యార్థులకు కడుపునొప్పి, విరోచనాలు కావడం వలన డిగ్రీ పరీక్షలు సరిగా రాయలేని పరిస్థితి ఏర్పడింద ని వారు అన్నారు. ప్రిన్సిపాల్ సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోవడంతో సీనియర్ విద్యార్థులు కొంతమంది జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడడం సీనియర్ విద్యార్థులకు ప్రిన్సిపాల్ మద్దతు పలుకుతూ వారిని ప్రోత్సహించడంతో విద్యార్థుల మధ్య రెండు బృందాలుగా ఏర్పడి కళాశాలలో ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా ప్రిన్సిపాల్ వ్యవహార శైలి ఉందని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ కళాశాలపై పర్యవేక్షించి జరుగుతున్న పరిణామాల పట్ల పరిశీలన చేసి కళాశాల ప్రిన్సిపాల్ ను స్పెండ్ చేసి వివాదానికి పాల్పడుతున్న కొంతమంది అధ్యాపకులను సైతం కళాశాల నుండి మార్చి కళాశాలలో విద్యార్థులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !