నేటి గద్ధర్ న్యూస్, పినపాక: పినపాక మండలం అమరారం పంచాయతీలో ఎంపీటీసీ కాయం శేఖర్ మాజీ సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు . కొత్తూరు కాలనీ సామర్లకోట, జొన్నలగూడెం గ్రామాల్లో బి ఆర్ ఎస్ శ్రేణులతో కలిపి ప్రచార నిర్వహించారు.ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత విజయం విజయం కొరకు ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త శ్రమించాలన్నారు. ఓటర్ మహాశయులు కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడవి హక్కుల కమిటీ చైర్మన్ కొట్టెం. ప్రసాద్.. యాలం.మల్లయ్య, చింత.మత్తయ్య, పర్షిక .రామారావు,బిజ్జ. రామారావు, తాటి సందీప్, సోయం. సుదర్శన్, వడ రాము తోలేం. సాగర్ పాల్గొన్నారు.
Post Views: 142