★ములుగు జిల్లా BRSV నాయకులు దుర్గం రాజ్ కుమార్
నేటి గద్ధర్ న్యూస్ (మే 11), ములుగు:ములుగు జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు
ములుగు జిల్లా BRSV నాయకులు దుర్గం రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కొరకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను దూరం చేస్తే ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న జిల్లాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు .అభివృద్ధి లో పరుగులు పెడుతున్న అటవీ ప్రాంతమైన ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ములుగు జిల్లా రద్దు చేస్తే ఊరుకునేది లేదన్నారు. జిల్లాను రద్దు చేస్తే ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎ. రాజేష్, ఎం. మురళి తదితరులు పాల్గొన్నారు.