+91 95819 05907

ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి:SP

నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు
– 2500 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్త్
– మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు
– జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

నేటి గద్దర్, మే 12, భద్రాద్రి కొత్తగూడెం :

రేపు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా భద్రతాపరమైన అన్ని రకాల చర్యలను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 971 పోలింగ్ కేంద్రాలలో జరగబోయే ఓటింగ్లో ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులకు అనుమతి లేదని, ప్రజలంతా ఇట్టి విషయాన్ని గమనించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ను ఖచ్చితంగా అమలయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలలో గానీ, పరిసర ప్రాంతాల్లో గానీ ఓటర్లను ప్రలోభ పెట్టె వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా నగదు, మద్యం ఇతరత్రా వస్తువులను ఎవరైనా పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి గానీ, సీ-విజిల్ యాప్ ద్వారా గానీ ఫిర్యాదు చేసి సమాచారం అందజేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదని, ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చర్యలను అతిక్రమిస్తే అట్టి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కావున ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే పోలింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !