నేటి గద్దర్ కరకగూడెం: మండల పరిధిలోని కొర్నవల్లి గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ విప్,పినపాక మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అయన నివాసంలో గుండాల,అళ్ళపల్లి, కరకగూడెం మండలాల బిఅర్ఎస్ పార్టీ బూత్ ఇంచార్జీలు,బూత్ ఏజెంట్లతో అయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవ్వరైనా పని చేస్తె ఎంతటి వారినైన ఉపేక్షించేదిలెదని,వారిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తానని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు కొలెటి భవాని శంకర్,పాయం.నరసింహరావు,తెల్లం.భాస్కర్,మల్కం.వెంకటేశ్వర్లు మూడు మండలాల బూత్ ఇంచార్జీలు,ఏజెంట్లు పాల్గొన్నారు.
Post Views: 80