నేటి గద్దర్ న్యూస్.ములకలపల్లి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను గండుగులపల్లి లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ములకలపల్లి మండలం లో ఓటింగ్ 81 శాతం రావటం పట్ల కష్ట పడ్డ ప్రతి కూటమి కార్యకర్తలను అభినందలు తెలిపారు,ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అందరు ఐక్యం గా ఉండి రానున్న ప్రతి ఎన్నికల్లో విజయం సాదించాలని కోరారు, మండల అభివృద్ధికి యువ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో కృషి చేస్తాం అని తెలియపారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు పెటేటి నర్సింహారావు,మాజీ సొసైటి అధ్యక్షులు పర్వతనేని అమర్ నాధ్, పువ్వల మంగపతి , సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ , సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు , కాంగ్రెస్ మండల నాయకులు బాల అప్పారావు , సిపిఎం మండల నాయకులు ఉకంటి రవి , సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
