ఓటు వేసి తిరిగి హైదరాబాద్ నగరానికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లారు.హైదరాబాద్ నుండి ఓటు వెయ్యడానికి బాపట్ల జిల్లా చినగంజాం, గొసనపూడి, నీలాయపాలెం గ్రామాలకు వెళ్లిన 40 మంది ఓటు వేసి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నిన్న రాత్రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.అర్ధరాత్రి 1: 30 గంటలకు అందరూ నిద్రలోకి జారుకున్నాక చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామం దగ్గర వీళ్లు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సును టిప్పర్ డీకొట్టింది.క్షణాల్లో బస్సుకు మంటలు చెలరేగి డ్రైవర్‌తో సహా 6 మంది మంటల్లో సజీవ దహనం అవ్వగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Post Views: 232