+91 95819 05907

మరణంలో వీడని భార్యాభర్తల బంధం

… ఇద్దరికి తీవ్ర గాయాలు

కారులో వ్యాపించిన మంటలు.. ఫైర్ ఇంజన్ సహాయంతో ఆర్పివేత

నేటి గద్దర్, మే 15, బోనకల్ ప్రతినిధి:

మండలంలోని ముష్టికుంట్ల గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వివరాల్లోకి వెళ్తే ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలు గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ వృత్తిరీత్యా డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పలు చోట్ల పనిచేసి మధిరలో స్థిరపడ్డాడు. ఆయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడి ఇంటి వద్ద ఉంటున్న సూర్యనారాయణ దంపతులు ఖమ్మంలో నివాసముంటున్న పెద్ద కుమారుడు ఇంటికి బయలుదేరారు. మధిర నుంచి కారులో మనవడు అనిల్ నాయనమ్మ, తాతయ్యతో పాటు కేర్ టేకర్ నాగరాజు తో కలిసి ఖమ్మం బయలుదేరారు. ఈ క్రమంలో ముష్టికుంట్ల గ్రామం సమీపంలో ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు వృద్ధ దంపతులు కొత్తూరు సూర్యనారాయణ (92), రుక్మిణీ (85) లు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్, నాగరాజు తీవ్ర గాయాలతో కారులో ఇరుక్కుపోగా సమీపంలో ఉన్నవారు అతి కష్టం మీద బయటకు లాగారు. మృతదేహాలను పొలంలో ఉంచి, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో పెట్రోల్ పైపు పగలటంతో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. మంటలు విస్తృతంగా పొలాల పక్కన చెట్లకు అంటుకోవడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. పోలీసుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పి వేశారు. మధిర సీఐ మధు, బోనకల్ ఎస్సై మధుబాబు లు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !