+91 95819 05907

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం

*మానుకోటలో మార్మోగిన సన్నాహక సమావేశం

*హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ

*గెలిపిస్తే పేద ప్రజల రుణం తీర్చుకుంటాను…అభ్యర్థి పూజరి సత్యనారాయణ

నేటి గద్ధర్ న్యూస్ , మహబూబాబాద్: వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి పూజారి సత్యనారాయణ గారిని విద్యావంతులు, మేధావులు *38వ సీరియల్ నంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి* భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పట్టభద్రులను కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు గంట హరీష్ అధ్యక్షతన జరిగిన ముఖ్య సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పూజరి సత్యనారాయణ గారితో కలిసి సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి కోసం శాసనాల ప్రతిపాదనల కోసం చర్చలు చేయాల్సిన పెద్దల సభకు శాసనమండలికి విద్యావంతులైన మేధావులను పంపాలని ఈ సందర్భంగా విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పట్టు ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో నిష్కల్మషంగా, నిజాయితీగా పనిచేసిన రిటైర్డ్ ఎంఈఓ, సామాజిక ఉద్యమకారులు పూజరి సత్యనారాయణ గారిని ఓటు అనే ఆయుధం ద్వారా విద్యావంతులు సపోర్ట్ చేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పూజరి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి గెలిపించినట్లయితే పేద ప్రజల రుణం తీర్చుకుంటానని, విద్యా ఉద్యోగ పారిశ్రామిక రంగాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది చట్టసభల ద్వారా పేద ప్రజలగొంతునై వినిపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య, రాష్ట్ర సలహాదారులు కృష్ణమోహన్, రాష్ట్ర కార్యదర్శి మాంచాలక్క, గ్రేటర్ వరంగల్ అధ్యక్షురాలు లక్ష్మి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, ఉపాధ్యక్షులు నరేష్, ప్రచార కార్యదర్శి దాసరి భాస్కర్, చిత్తరి సోమన్న,జిల్లా కమిటీ సభ్యులు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సామాజిక ఉద్యమకారులు, ఆర్టిఐ కార్యకర్తలు, పలు సామాజిక కుల ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యనారాయణ గెలుపు కోసం పని చేస్తామని సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !