◆క్రీడలతో ఐక్యమత్యం: మండలనేతకాని సంఘం నాయకులు సునారికాని రవి.
నేటి గద్ధర్ న్యూస్,ములుగు(వెంకటాపురం):
వెంకటాపురం మండలం లోని వాడగూడెం గ్రామం లో ప్రముఖ నాయకులు మన్యం సునీల్ ఆర్థిక సహాయంతో , తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి ఈశ్వర్ నేతకాని చేతుల మీదుగా క్రికెట్ కిట్ పంపిణీ చెయ్యడం జరిగింది..ఈ సందర్భంగా మండల నాయకులు సునారికాని రవి, జాడి ప్రతాప్ మాట్లాడుతూ యువతకు క్రికెట్ కిట్ కోసం ఆర్థిక సహాయం చేసిన పెద్దలు మన్యం సునీల్ బాబు కి ధన్యవాదములు తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభించడంతోపాటు యువతలో ఐక్యమత్యం పెరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో జాడి శ్రీకాంత్, జాడి ప్రతాప్, జిమిడి నందు, గజ్జెల కిషోర్, గోగు చిరంజీవి, జాడి మురారి, జిమిడి చరణ్, కావిరీ నిర్మల్ ప్రశాంత్, అలుకురాం తదితరులు పాల్గొన్నారు.
Post Views: 305