అభివృద్ధిని చేతల్లో చూపిస్తా
మాటలు చెప్పడం నాకు తెలీదు
మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి… మీ కష్ట సుఖాలను పంచుకుంటా
– అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే నా లక్ష్యం
– ప్రజల చెంతకే.. మీ శీనన్న
కార్యక్రమంలో మంత్రి పొంగులేటి
– ఖమ్మం రూరల్ మండలంలో విస్తృత పర్యటన
నేటి గదర్, మే 19 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా తాను ఉంటానని.. మాటలు చెప్పడం కాదని.. అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చేసి చూపుతానని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి, పల్లెగూడెం, పోలేపల్లి, గోళ్ళపాడు, తీర్థాల , మద్దివారి గూడెం, పోలిశెట్టి గూడెం తదితర గ్రామాల్లో మీ చెంతకే శీనన్న కార్యక్రమం పేరుతో పర్యటించారు. తొలుత రెడ్డిపల్లిలోని మారెమ్మ తల్లి దేవాలయంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో పర్యటించారు.
★మంత్రి దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్లో కొన్ని
★రెడ్డిపల్లి గుట్టపై ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి.
★కొత్తగా కరెంట్ స్తంభాలు వేయాలి.
★కాలనీలో సీసీ రోడ్లు పోయాలి.
★పల్లెగూడెం: బుడగ జంగాలకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలి.
★డ్రెయినేజీ సమస్య లేకుండా చూడాలి.
★పోలేపల్లి, గోళ్లపాడు..:* వీధుల్లో సీసీ రోడ్లు పోయాలి.
★ పక్కా ఇల్లు లేని వారికి.. ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయాలి.
–
★నేనెప్పుడూ ప్రజలతోనే ఉంటా
తాను ప్రజల మనిషినని.. ఎప్పుడూ జనంతోనే మమేకమవుతూ ఉంటానని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. వరుసగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రావడం వల్ల అన్ని గ్రామాల పర్యటన చేపట్టడం ఆలస్యమైందని అన్నారు. కోడ్ ముగిశాక పల్లెల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా పేదలకు లబ్ధి కలిగేలా చూస్తామని అన్నారు. ప్రజల దీవెనలతోనే పాలేరు ఎమ్మెల్యే గా గెలిచానని, రాష్ట్ర మంత్రి అయ్యానని అన్నారు. శీనన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ.. అండగా నిలుస్తానని అభయమిచ్చారు. తన దృష్టికి తీసుకువచ్చిన ప్రజా సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండలాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయకులు మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, రామ్మూర్తి నాయక్, శ్రీనివాస రావు, భుజంగ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కూర్మా రావు, మద్ది కిషోర్ రెడ్డి, విజయ్ రెడ్డి, సురేష్ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.