నేటి గదర్,మే 18 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
ఆ రోడ్ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు చూస్తేనే వళ్ళు జల్లుమంటుంది.. అసలు మనిషి శరీరం కనిపిస్తే ఒట్టు .. అంతటి భయానక రోడ్ ప్రమాదం కూసుమంచి మండలం జుజ్జులరావు పేట గ్రామ సమీపంలో నేషనల్ హైవే 369 బి పై జరిగినది. ప్రమాదానికి సంబంధించి వివరాలు … ప్రమాద స్థలంలో దొరికిన మృతుడి గుర్తింపు కార్డుల ద్వారా ఆ వ్యక్తి సూర్యాపేట జిల్లా కరివిరాల గ్రామానికి చెందిన ఉపేందర్ (40) గా తెలియవస్తుంది.. ద్వి చక్ర వాహనంపై వస్తున్న ఉపేందర్ ను లారీ బలంగా డీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది . ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన శరీర భాగాలు కనిపించకుండా రోడ్డుకు అత్తుక్క పోయి చిద్రవధం అయ్యాయి. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి శరీర భాగాలను మూటగా కట్టి ఖమ్మం ప్రభుత్వ మార్చురీకి తరలించినట్టు సమాచారం..ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..